డ్రంక్ అండ్ డ్రైవ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

న్యూస్ ఇయర్ సందర్భముగా మాస్ వార్నింగ్

హైదరాబాద్ పోలీసుల జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా మద్యం తాగి వాహనాలు నడపకూడదని గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. మద్యం సేవించే వాహనదారులు డ్రైవింగ్ను పూర్తిగా నివారించాలన్నారు. దానికి కోసం క్యాబ్ను ఎంచుకోవాలని సజ్జనార్ సూచించారు,

 

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని  సీపీ  హెచ్చరించారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అన్న ఎవరో తెలుసా? అని మా అధికారులను అడగొద్దు. మీ ప్రైవసీకి మర్యాద ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం’ అని తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram