గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / తల్లిదండ్రులు, రెండేళ్ల లోపు పిల్లలకు డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి దగ్గు మందులు ఇవ్వవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.ఆల్మంట్- కిడ్’ దగ్గు సిరప్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TGCDA) ఆదేశించింది, ముఖ్యంగా తల్లిదండ్రులను, రిటైలర్లను, ఆసుపత్రులను కోరింది. సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ కలుషితమై విషపూరితమైనట్లు.. ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ నుంచి హెచ్చరిక అందింది. ఈ నేపథ్యంలో ఎవరివద్దనైనా ఈ సిరప్ ఉంటే.. వాడకం, విక్రయం నిలిపివేయాలని సూచించింది. పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Post Views: 226









