మేడారంలో బకెట్ వేడి నీళ్ల రూ.50.ఆందోళనలో భక్తులు

గోల్డెన్ న్యూస్ / తాడ్వాయి / ములుగు జిల్లా  మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ మహోత్సవం ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా నిర్వహించబడుతుంది. దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరను ‘దక్షిణ భారత కుంభమేళా’గా పిలుస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మలకు అంకితమైన ఈ ఉత్సవం వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది.  మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. పెరుగుతున్న చలి తీవ్రతను ఆసరాగా చేసుకుని, జంపన్న వాగు సమీపంలో వేడి నీటిని ఒక్కో బకెట్‌కు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ అధిక ధరతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విక్రయాల ద్వారా వేలల్లో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా  జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై కొలువుదీరనుండగా, 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకుంటారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram