గోల్డెన్ న్యూస్/ దుమ్మగూడెం / మండలంలోని లింగాపురం, రాజగుంపు జీపీఎస్ పాఠశాలలను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు. ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జీపీఎస్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని పి ఓ అన్నారు.విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, పాఠ్యపుస్తకాలలోని ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. కొంతమంది విద్యార్థులు వర్క్ బుక్ అంశాల్లో వెనుకబడి ఉన్నట్లు గమనించిన పీవో అసంతృప్తి వ్యక్తం చేశారు. పునాది స్థాయి నుంచే బోధన బలోపేతం కావాలంటే ఉపాధ్యాయులు ప్రతి అంశాన్ని పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. నెల రోజుల తర్వాత మళ్లీ పాఠశాలలను సందర్శించి పురోగతిని సమీక్షిస్తానని అన్నారు.
Post Views: 377









