లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి

మోడీ సర్కార్ దిగి వచ్చేంతవరకు ఐక్య పోరాటాలను కొనసాగిస్తాం.

కార్మికుల పోరాటానికి ప్రభుత్వాలు దిగిరాక తప్పదు.

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మరణ శాసనాన్ని రాయాలని చూస్తున్న మోడీ నీ గద్దె దించే వరకు కార్మిక కర్షక ఐక్య పోరాటాలు ఆగవని మోడీ నిరంకుశ విధానాలపై కార్మికులకు ఉన్న వ్యతిరేకత దేశవ్యాప్త సమ్మెతో మరోసారి ప్రపంచానికి తెలిసిందని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు స్పష్టం చేశారు. దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సమ్మె కరకగూడెం మండలం లో విజయవంతమైంది సమ్మెతో అన్ని స్కీం వర్కర్లైన ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజన ప్రభుత్వ శానిటేషన్ గ్రామపంచాయతీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో కార్మిక ప్రదర్శన నిర్వహించి సమ్మెను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారం చేపట్టిన నాటినుండి ఒక్కొక్కటిగా కార్మిక హక్కులను కాలరాస్తూ చివరి అస్త్రంగా కార్మిక చట్టాలను సైతం రద్దు చేశారని అన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అమల్లోకి తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానాన్ని రద్దుచేస్తూ 12 గంటల పని విధానాన్ని తీసుకురావటమే కాకుండా కార్మికులను విభజించి పాలించే విధంగా యూనియన్లు పెట్టే అవకాశాన్ని కూడా లేకుండా మోదీ సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతివేసిన కార్మిక చట్టాలను పునర్దించాలని వారు డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ దిగివచ్చేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలను కొనసాగిస్తామని ఈ సమ్మెతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవకపోతే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం తాసిల్దార్ వట్టం కాంతారావు కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారుఈ కార్యక్రమంలో అంగన్వాడి రంగం నాయకులు భవాని, స్వరూప, సుజాత, శిరీష, మంగతాయారు గ్రామపంచాయతీ రంగం కార్మికులు గుమ్మడవెల్లి కృష్ణ ధనుంజయ్ చర్ప సాంబశివరావు, రమాదేవి ,సావిత్రి , మంగమ్మ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram