భద్రాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లాలోని ఆళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో శనివారం రోజు పెద్దపులి సంచరించినట్లు గ్రామస్తులు గుర్తించారు. విషయం అటవీశాఖ అధికారులు తెలుపగా పెద్దపులి రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్ళపల్లి రేంజ్ లోకి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారుల పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
రైతులు, కూలీలు ఎవరూ పంట పొలాలవైపు వెళ్లొద్దని.పశువుల కాపరులు , గ్రామస్తులు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్లోద్దని అధికారులు హెచ్చరించారు.పంట పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. గాగాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు ఫారెస్ట్ అధికారులు.
పులల సంచారం కొన్ని గ్రామాల్లో రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. అడవుల నుంచి దారి తప్పి గ్రామాల్లోకి వస్తున్న పులులు పశువులపై పంజా విసురుతున్నాయి
అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను పాదము ద్రలనుపరిశీలించారు. గ్రామాల పరిధిలో చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. 









