మీకు రేషన్ కార్డు ఉందా అయితే గుడ్ న్యూస్

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..

3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ..

 

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే వేసవి కాలం దృష్ట్యా  మూడు నెలల సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.

 

ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి మూడు నెలలకు సరిపడ కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది

 

ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతోపాటు.. డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సంబంధించి మూడు ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర (థంబ్) వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వస్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 15-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది._

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram