మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళ సర్పంచ్ కి ఘన సన్మానం
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమత్ మోతె సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ అన్నారు.
ఆదివారం కరకగూడెం మండలంలోని సమత్ మోతె(గొల్లగూడెం) గ్రామపంచాయతీ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామ మహిళలు మరియు మహిళా వార్డు సభ్యులు ఆధ్వర్యంలో స్థానిక మహిళ సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ గారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జిమ్మిడి విజయ్, అంగన్వాడి టీచర్ కుంజ సావిత్రి,విఓ సభ్యులు తోలెం సత్యవతి,వార్డు సభ్యులు గుడ్ల రంజిత్,యువత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 154









