గోల్డెన్ న్యూస్ /మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ జరిగి, నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ సిబ్బంది ఆహార నియమ నిబంధనలు పాటించక పోవడం, ఆహారంలో నాసిరకమైన వంటకాలు పెట్ట డం వల్లనే సుమారు 24 మంది విద్యార్థిను లకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని, వారిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, నలుగురిని మాత్రమే ఆస్పత్రిలో చేర్పించి మిగతా విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని సిబ్బంది దాచిపెడుతున్నారని రేణుక అక్షరం మహిళా మండలి అ ధ్యక్షురాలు పూనెం సరోజ ఆరోపించారు. హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్, సిబ్బంది, మటన్ సప్లై చేసిన కాంట్రక్టర్పై కలెక్టర్ చర్యలు చేపట్టా లని ఆమె కోరారు. కాగా హాస్టల్ ఫుడ్ వల్ల అస్వస్థత కలుగలేదని, బయట తిన్న భోజ నం వల్లే అస్వస్థతకు గురయ్యారని హాస్టల్ సిబ్బంది చెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకొని వి ద్యార్థులను పరామర్శించారు. ప్రస్తుతం వి ద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు . బీఆర్ఎ స్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విద్యా ర్థులను పరామర్శించారు. విద్యార్థులకు మె రుగైన వైద్య సహాయం అందించాలని ఆస్ప త్రి సిబ్బందికి సూచించారు.










