గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా తీవ్ర ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ప్రజలకు తీపి కబురు చెప్పింది. తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు అంటే.. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదలై మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు ఈ భారీ వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది.
Post Views: 380









