రానున్న 3 రోజుల పాటు వర్షాలు

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని  వారు పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షం పడే అవకాశముంది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, జనగామ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram