అనారోగ్యగా ఉంటే వైద్య సిబ్బందిని సంప్రదించండి,
గర్భిణీలు ప్రసవ సమయానికి ముందే ఆస్పత్రికి రావాలి
ఆదివాసీల జీవన విధానాన్ని పరిశీలించిన భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్,
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం/ వలస ఆదివాసి గ్రామంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి పర్యటనభద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శివారు వలస ఆదివాసి గుత్తికోయి గ్రామమైన క్రాంతి నగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పర్య టించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వ హిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ంలోని ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వారిస ఆయన పర్యవేక్షించారు. కాలినడకన గ్రామ తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ ర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల ఆరోగ్యం, వారి ఆహార అలవాట్లు, జీవన విధానం గురించి ప్రత్యేకంగా విచారణ చేశారు. గర్భిణీలు ప్రసవానికి ముందు గానే ప్రసవం (బర్త్) ప్లాన్ సిద్ధం చేసు కో వాలని, రవాణా సౌకర్యం లేని పరిస్థితులను దృ ష్టిలో ఉంచుకుని ఆరోగ్య సిబ్బంది అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అర్హులైన
పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు తప్ప నిసరిగా ఇవ్వాలని సూచించారు. గ్రామ పెద్ద లతో సమావేశమై, ఎండాకాలంలో అడవులకు వెళ్లే సమయంలో త్రాగునీరు వెంట తీసుకె ళ్లాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉం చుకోవాలని తెలిపారు. వండిన ఆహారాన్ని అదే రోజు తీసుకోవాలని, మరుసటి రోజు దాచిపెట్టి తినడం వల్ల వాంతులు, విరేచనాలు వచ్చే ప్ర మాదం ఉందని హెచ్చరించారు. అలాగే పొ గాకు, మత్తు పదార్థాలు, ఆల్కహాల్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.పాము కాటు, కుక్కకాటు వంటి అత్యవసర పరిస్థి తులకు రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నా యని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజ లకు అవగాహన కల్పించారు. చత్తీస్గఢ్ రాష్ట్రా బనికి వెళ్లి వచ్చే గ్రామస్తులకు మలేరియా పరీ క్షలు నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందికి సూచి ంచారు. గర్భిణీలు మరియు చిన్నపిల్లలు పౌషి కాహారం తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు. ఈ సం దర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై వారి సాంప్రదాయాలు, ఆచారాలను తెలుసుకున్నా రు. మారుమూల గ్రామంలో సమర్థవంతంగా ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆరోగ్య సిబ్బంది రామచంద్రు, పార్వతి, ఎం ఎల్ హెచ్ పి వీరభద్రం, పద్మ (ఆశా కార్యకర్త)లను ప్రశం సించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరో ధక టీకాల అధికారి డాక్టర్ ప్రతాప్, హెల్త్ ఎక్సె గ్టన్షన్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాలొ న్నారు. అదేవిధంగా జిల్లాకార్యాలయం నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీ సర్లతో కూడా పునఃశ్చరణ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహి ంచడం జరిగినది మరియు అన్ని పీహెచ్సీలలో మెడికల్ ఆఫీసర్లకు డిప్యూటేషన్ వేయడం జరిగినది..








