ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ప్రభుత్వ పథకాల అమలు పై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం…

గోల్డెన్ న్యూస్/ పినపాక /ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రతీ ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పథకం ఇందిరమ్మ ఇల్లులు, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, సన్న బియ్యం తో పేదల కలలను సహకారం చేస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వమని తెలిపారు…ఇందిరమ్మ ఇల్లుల విషయం లో ఎవరు అదైర్య పడవద్దని విడతల వారిగా పేదలందరికి మన కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇల్లులు అందుతాయని ఈ సందర్బంగా తెలియచేసారు.

అలాగే మీ ప్రాంత అభివృద్ధి కొరకై పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడం జరుగుతుంది అని ఈ స్కూల్ గోపాలరావుపేట మరియు చుట్టూ పక్కల గ్రామాలు పినపాక మండలంలోని ప్రజలకు ఉపయోగపడడమే కాక ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని తెలియచేసారు.

ఎన్ని డబ్బులైన నేను, మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని సంక్షేమ పథకాలన్నీ అన్నీ వర్గాల ప్రజలకు అందేలా చూడాలని స్థానిక సర్పంచులకు, ఉపసర్పంచులకు ఈ సందర్బంగా తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 20 స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే గారు అందజేశారు.ప్రతీ కుటుంబంలో మహిళా ఆర్థికంగా నిలబడితేనే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశ్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram