గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన సిఎం రేవంత్ రెడ్డి

పెండింగ్ లో ఉన్న ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరారు.

 

ప్రొ.కోదండరామ్, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

 

ఏ సభలో సభ్యుడు కానప్పటికీ దాదాపు ఆరునెలలుగా అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆరు నెలలలోపు కచ్చితంగా ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎంపిక కావలసి ఉంటుంది..! దీని ప్రకారం ఆయన గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది

 

గవర్నర్ ఆమోదించని ఈ నెల 30 తర్వాత అజారుద్దీన్ పదవి కోల్పోయే అవకాశం ఉంది..!

 

ఈ నేపథ్యంలోనే గవర్నర్ ను సీఎం కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది..!

 

గతంలో ఒకసారి కోదండరాం తో పాటు అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలు ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. బీ ఆర్ ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హై కోర్టు కు వెళ్లడంతో పెండింగ్ లో పడిపోయింది..! గతంలో వారి అభర్థిత్వాలను ఆమోదించేందుకు నాడు గవర్నర్ గా ఉన్న తమిళిసై నిరాకరించారు..!

 

రెండవసారి తీర్మానంలో అమీర్ అలీఖాన్ ను తప్పించి కోదండరాం తో పాటు అజారుద్దీన్ పేరును సిఫారసు చేస్తూ గవర్నర్ కు పంపించారు.. అయితే ఆరు నెలలు కావస్తున్నా గవర్నర్ కార్యాలయం నుండి ఎలాంటి స్పందన లేదు..

 

నిజానికి గవర్నర్ కోటలో ఇద్దరి ఎమ్మెల్సీల కోసం అభ్యర్థన పంపిన సమయంలో తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఉన్నారు.. గత నెలలో ఆయన స్థానంలో శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు..!

 

జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తారా.. లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. చూడాలి ఈ వారం రోజుల్లో ఈ జరగబోతుందో..!

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram