గోల్డెన్ న్యూస్/ బూర్గంపాడు / రైతు కన్నీరు మున్నూరు పెడుతున్న పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండించిన వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేక రైతులు మార్కెట్ యార్డులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో యాడ్ ని సందర్శించిన సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు యాసంగి పంట పండించి మార్కెట్ యార్డులో పొలాలలో ధాన్యాన్ని ఆరబోసి కొనేవాళ్ళు లేక దిక్కు దోషిని స్థితిలో ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది
ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టి రైతుని వరి ధాన్యం మళ్ళీ పంట వేయకుండా చేయాలనే యొక్క కుట్రతో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని
అన్నారు
అంతేకాదు దళారి చేతిలో దారుణంగా మోసపోతున్న రైతులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల దళారులకు దారుణంగా అమ్ముకుంటున్న రైతులు కాటా 72 కేజీలు ధాన్యం వచ్చింది1200 కు అమ్ముతున్నా పరిస్థితి దళారులకు ఆరిన ధాన్యం 1390 కి అమ్ముకుంటున్న పరిస్థితి కానీ
ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొనే పరిస్థితి లేకుండా ఉందని రైతులు అకాల వర్షాలు వస్తాయేమో అని భయంతో వచ్చిన మట్టికే సాలు అని దళారులకు దారుణంగా అమ్ముకుంటున్న పరిస్థితి
రైతులకు నిబంధనలు విధించటం ధాన్యం అమ్ముకోవాలంటే
తేమ 17% ఉంటేనే తప్ప.
చెత్త తాలు ఒక శాతం. మట్టి పెడ్డలు రాళ్లు ఒక శాతం. చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన పురుగు తిన్న దాన్నం ఐదు శాతం. పూర్తిగా తయారు కాని ముడుచుకుపోయిన ధాన్యం మూడు శాతం. తక్కువ రకములు మిశ్రమం ఆర్ శాతం. ఈ నిబంధనలతో రైతుల్ని ధాన్యం పండించకుండా చేయాలనే కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు
వీటికి తోడు టోకెన్ నెంబర్. ఆధార్ కార్డు జిరాక్స్. భూమి పట్టా పాసు బుక్కు. బ్యాంకు పాస్ బుక్. ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్. సాగు ధృవీకరణ పత్రము.
ఇవన్నీ రైతుకి
భారమే నా పరిస్థితి ఇవన్నీ ఉంటేనే
మీ ధాన్యం కొనుగోలు అవుతుందని ప్రభుత్వం హెచ్చరికలకు రైతులు బెంబేలెత్తిన పరిస్థితి
వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులని ఆదుకోవాలని లేనిపక్షంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సి వస్తుందని రైతులకు ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఎం డిమాండ్ చేసింది
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు భయ్యా రాము సోమయ్య కృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు









