మణుగూరు ఏరియా సివిల్ ,పర్సనల్ డిపార్ట్మెంట్ లలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న, ఇంజనీర్లను,అధికారులను, సూపర్వైజర్లను బదిలీ చేయాలి
జిఎం సివిల్ ధనసరి. వెంకటేశ్వర్లు కి, జిఎం పర్సనల్ కవిత నాయుడు కి వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు కర్నే. బాబురావు
గోల్డ్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / మణుగూరు ఏరియా సివిల్ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ లలో అధికారులను, సూపర్వైజర్లను ఇతర ఏరియాలకు బదిలీ చేయాలనీ కోరుతూ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో జిఎం సివిల్ ధనసరి. వెంకటేశ్వర్లు కి, జిఎం పర్సనల్ కవిత నాయుడు కి వినతి పత్రాలు అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే. బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి మణుగూరు ఏరియాలో సివిల్ మరియు పర్సనల్ డిపార్ట్మెంట్లలో కొంతమంది అధికారులు సూపర్వైజర్లు, ప్రమోషన్లు తీసుకుని కూడా ఎన్నో ఏండ్లుగా ఇక్కడే ఫాతుకుపోయి ఇతర ఏరియాలకు ట్రాన్స్ఫర్ లు లేకపోవడంతో ఏక ఛత్రాధిపత్యంతో , మేము చెప్పిందే చట్టం, మేము చేసేదే న్యాయం మేము మొనార్కులం అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు, క్రమశిక్షణ పేరుతో కార్మికులను ఎంతగా వేధిస్తే అంతగా తమకు ప్రమోషన్లు వస్తాయని అతిగా ప్రవర్తించే ఇలాంటి అధికారులతో మణుగూరు ఏరియాలో అశాంతి నెలకొంటుందని పారిశ్రామిక సంబంధాలు దెబ్బతింటున్నాయని ఏరియాలో సంస్థ ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మిక సంఘాలు కూడా ఇలాంటి అధికారుల పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు, వాస్తవాలను పరిశీలించి తక్షణమే సంబంధిత అధికారులను, సూపర్వైజర్లను గుర్తించి ఇతర ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేయాలని మణుగూరు ఏరియాకు మోక్షం లభించే దిశగా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మణుగూరు ఏరియాలో కన్వినేన్స్ వాహనాల దుబారా కూడా అరికట్టాలని సంస్థకు ఆర్థిక నష్టం తగ్గించాలని ఏరియా జిఎంని కోరారు. స్పందించకపోతే సిఎండి, డైరెక్టర్లకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు.









