ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డిస్క్ / దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ప్రమాణాలు పాటించకుండా టీచర్లను నియమించడం లేదా సర్వీసులో కొనసాగించడం కుదరదని స్పష్టం చేసింది..అర్హత లేనివారిని స్కూళ్లు, కాలేజీల్లో ఉపాధ్యాయులుగా నియమించడాన్ని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.

 

RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం TET, NET అర్హత సాధించినవారిని మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది.

 

ఆర్టికల్ 21-A ప్రకారం నాణ్యమైన విద్య పొందడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని వెల్లడించింది.

 

బ్యాక్‌డోర్ నియామకాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని ఉద్యోగ భర్తీలు పారదర్శకంగా జరగాలని ఆదేశించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram