హైదరాబాద్: తన నియోజకవర్గ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆర్మూర్ బిజెపి శాసనసభ్యులు రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో అసంతృప్తి వ్యక్తం చేశారు.నిజామాబాద్ జిల్లా అంటే ఎవరికి పట్టని జిల్లాగా మారింది నిజాం కాలంలో నిర్మించిన భవనంలోనే రెవెన్యూ, సబ్ కలెక్టర్ కార్యాలయాలు కొనసాగుతున్నాయని. నూతన భవనాలు నిర్మించాలని సీఎంకు, సంబంధిత మంత్రికి విన్నవించిన ఫలితం శూన్యం నిజామాబాద్ జిల్లా అంటే ఎవరికి పట్టని జిల్లాగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో నిజాం కాలంలో నిర్మించిన శిధిలమైన భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయని అన్నారు. అవసరమైతే రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. సభ చివర్లో నాకు ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి అధ్యక్షా. నేను ఇవాళ రాజీనామా చేయాలనుకుంటున్నా’ అని తనదైన స్టైల్లో హెచ్చరించారు.
Post Views: 22









