గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు
కరకగూడెం : వైద్యానికి సుదూర ప్రాంతాల్లో ఉంటున్న గిరిజన గ్రామాల్లో కరకగూడెం వైద్యాధికారి ఈ రవితేజ పిహెచ్సి సిబ్బందితో కలిసి బుధవారం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆదివాసీలకు మందులు పంపిణీ చేశారు.
మండలంలోని రేగళ్ల పంచాయతీలోని రేగళ్ల, చింతల గుంపు, మాదన్న గూడెం, పడిగాపురం గ్రామాలలో సర్పంచ్ బాడిష పార్వతి పర్యవేక్షణలో వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో వైద్యశిభిరాలు నిర్వహించి వ్యాధ్యలతో బాడపడుచున్న వారికి 102 నందికి వైద్య పరీక్షలు నిర్వహించి , అవసరమైన వారికి రక్త పరీక్షలు చేశారు. ఉచిత మందులు పంపిణీ చేశారు. అనంతరం సీజనల్ వ్యాధులపై, పరిసరాల శుభ్రతతో పాటు, వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలలో దోమల మందు పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో పోలవేణి కృష్ణయ్య, నర్సింహారావు, గ్రామ పంచాయితీ సిబ్బంది. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










