ఏటూరునాగారo : ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి..
రాత్రి స్టడీ టైంలో 6, 7వ తరగతి విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.
దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం..
రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం..
విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు..
అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం..
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..
రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్మెన్లను ఏర్పాటు చేయడంతో పాటు.. ఏఎన్ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు.
ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్..









