పీఎంపీ,ఆర్ఎంపీ వ్యవస్థల బలోపేతం చేయాలి

పీఎంపీ,ఆర్ఎంపీ వ్యవస్థల బలోపేతం:

టీడీ జనార్ధన్

 

న్యూఢిల్లీ,  దేశవ్యాప్తంగా ఉన్న పీఎంపీలు,ఆర్ఎంపీల వివరాలను సేకరించాలని కేంద్రానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పీఎంపీ, ఆర్ఎంపీల జేఏసీ గౌరవ అధ్యక్షుడు టీడీ జనార్దన్ విజ్ఞప్తి చేశారు. పీఎంపీలు, ఆర్ఎంపీల లెక్కలు సేకరించాక వారి సామర్థ్యం, నైపుణ్యం ఆధారంగా వారిని వర్గీకరించి తగిన శిక్షణ అందించాలని ఆయన కోరారు. బుధవారం, ఢిల్లీలో ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్ఎంపీ, పీఎంపీల జేఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య అతిథిగా టీడీ జనార్దన్ హాజరయ్యారు. అనంతరం, ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శిక్షణ అనంతరం పీఎంపీలు, ఆర్ఎంపీలకు తగిన పరీక్షలు నిర్వహించి వారిని అధికారికంగా నమోదు చేయాలన్నారు

 

Facebook
WhatsApp
Twitter
Telegram