స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కరకగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

 

కరకగూడెం మండల కేంద్రంలో ఈరోజు (శనివారం) ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను  లబ్ధిదారులకు ఆయన స్వయంగా పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…గతంలో రేషన్ కార్డులు లేక అనేక మంది అర్హులైన పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నదని తెలిపారు. నిరుపేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేందుకు ఈ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే పినపాక నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వట్టం కాంతయ్య, ఎంపీడీవో, శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు  సభ్యులు, ముఖ్య నాయకులు,  మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 

Facebook
WhatsApp
Twitter
Telegram