మైనర్ బాలిక ఆత్మహత్య?

ప్రేమ పేరుతో వేధింపులు..

మైనర్ బాలికఆత్మహత్య

 

వికారాబాద్ : పరిగి మండలం రావులపల్లిలో విషాదం యువకుడి వేధింపులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో అలముకున్నాయి. విషాదఛాయలు

గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బయటకు రావాలంటూ బాలికకు పలుమార్లు ఫోన్ చేసి మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వేధింపులతో మనస్తాపానికి గురైన బాలిక గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

బాలిక బావిలో దూకిన విషయాన్ని గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పరిగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం బాలిక మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమితం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి చరణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.

 

పిన్న వయసులోనే బాలిక ప్రాణాలు చిన్న కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన రావులపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram