SIR రద్దు చేయాలి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. సారపాక సెంటర్ నుంచి ప్రగతి స్కూల్ వరకు ర్యాలీ.
బూర్గంపాడు : 2026అక్టోబర్ 11, ఆదివారం: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని SIR రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు.ఆదివారం నాడు సారపాక సెంటర్ నుంచి ప్రగతి స్కూల్ వరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన కేంద్ర ఎన్నికల అధికారి సర్ పేరుతో పదమూడు కోట్ల మంది ఓట్లు తొలగించారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుందన్నారు.ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం, ఎన్నికల అధికారి రాజీనామా చేయాలని,సర్ రద్దు చేయాలని డిల్లీ అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలపై పారా మిలటరీ బలగాలతో దాడులు చేయడం, అరెస్టులు చేయడాన్ని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు అన్నవరపు కనకయ్య,రేపాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద, బత్తుల వెంకటేశ్వర్లు, మర్మం చంద్రయ్య, నిమ్మల వెంకన్న సహాయ కార్యదర్శులు ముదిగొండ రాంబాబు,ఆలేటి కిరణ్,గడ్డం స్వామి,బందెల చంటి,యాసా నరేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే అబీద, మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు పాపినేని సరోజిని, సీఐటీయూ నాయకులు కనకం వెంకటేశ్వర్లు,రాయల వెంకటేశ్వర్లుకోట బాలక్రిష్ణ,, వ్య కాస జిల్లా కమిటీ సభ్యులు సౌభాగ్య, రాజేశ్వరి,షారోని, రమేష్,నూప క్రిష్ణ,పద్దం సుగుణ, మహేందర్, నాగభూషణం,సీత, వీరన్న, తదితరులు పాల్గొన్నారు








