ఐఏఎస్ ల బదిలీలు

12 మంది అధికారులకు కొత్త బాధ్యతలు

పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్లు బదిలీ అయ్యారు. వివిధ శాఖల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూనే, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్ప గించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సంజయ్ జాజు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం పెంచడంతో పాటు శాఖల మధ్య మెరుగైన సమన్వయం సాధించడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తున్నది.

 

కీలక అధికారుల బదిలీలు..కొత్త బాధ్యతలు

 

జయేష్ రంజన్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ నుంచి పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో పాటు ఈపీటీఆస్ఐ డైరెక్టర్ జనర ల్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నా రు. వికాస్ రాజ్ రవాణా, రోడ్లు, భవనాల శాఖ నుంచి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నవీన్ మిట్టల్ పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితుల య్యారు. వాణీ ప్రసాద్ క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగా, హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్గా అదనపుబా ధ్యతలు అప్పగించారు. రాహుల్ బొజ్జా బీసీ సంక్షేమ శాఖ బాధ్యతల్లో కొనసాగుతూనే, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.ఇలంబర్తి రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తాను చూస్తున్న పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ బాధ్యతలను కూడా కొనసాగించనున్నారు. సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ గా కొనసాగుతూనే, పట్టణాభివృద్ధి శాఖతో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించ నున్నారు. శ్రుతి ఓజా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ముషర్రఫ్ అలీ ఫారూఖీ తెలంగాణ రైతు డిస్కం సీఎండీ బాధ్యతల నుంచి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. సంగీత సత్యనారాయణ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బా ధ్యతలు చేపట్టనున్నారు. జితేష్ పాటిల్ టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా కొనసాగుతూనే, టీజీ రెడ్కో వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram