భారీ వర్షాలు, బలమైన గాలుల సమయంలో ముందస్తు జాగ్రత్తలతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోండి.
తాసిల్దార్ వట్టం కాంతయ్య.
✅ అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి.
✅ పొంగుతున్న వాగులు, కాలువలు దాటవద్దు. వరద నీటిలో నడవవద్దు, వాహనాలు నడపవద్దు.
✅ విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలకు దూరంగా ఉండండి.
✅ చెట్లు, బలహీనమైన గోడలు, శిథిల భవనాల వద్ద నిలబడవద్దు
✅ వాతావరణ శాఖ, జిల్లా అధికారుల అధికారిక సమాచారాన్ని అనుసరించండి
కరకగూడెం : అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం తహశీల్దార్ వట్టం కాంతయ్య సూచించారు. అత్య వసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు చేయవద్దని కోరారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.








