బిఆర్ఎల్ఎఫ్ (కోనేరు) సంస్థ ఆధ్వర్యంలో శ్రమదానం

కరకగూడెం  : మండలంలోని కన్నాయిగూడెం పరిధిలో బిఆర్ఎల్ఎఫ్ (కోనేరు )సంస్థల ఆధ్వర్యంలో శనివారం కలవల నాగారం గ్రామంలో శ్రమదానం  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధులన్నీ శుభ్రం చేశారు . అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదల ఆవశ్యకతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్తీ విజయ్ కుమార్, సంస్థ ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram