ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

      వైద్య  సేవలు భేష్

కరకగూడెం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రికార్డులు పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆషాడే కార్యక్రమంలో పాల్గొని పరిశీలించారు.  డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించుకోవాలని తెలియజేశారు. ఆశాలు ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పీఎంవో, మోహన్ రావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram