గోల్డెన్ న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి )
పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజ్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ మోసాలపై హెడ్ కానిస్టేబుల్ మల్సూర్ పిపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు చరవాణిలో గాని, ప్రత్యక్షంగా గాని మీ బ్యాంక్ వివరాలు, ఆధార్ వివరాలు, ఓటీపీలు చెప్పమని అడిగి మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే కు వచ్చే అధికారులు ఎటువంటి బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పమని అడగరని తెలియజేశారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ వివరాలు అడిగితే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
Post Views: 57









