రైతుభరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు..
అప్పటికల్లా డబ్బులు జమ..!
డిసెంబర్ చివరికి రైతు భరోసా పూర్తి చేసేలా కసరత్తు..
తెలంగాణ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుండడంతో భారీ ప్రణాళికలకు సిద్ధమవుతోంది. ఈ నెల 14 నుంచి.. రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. 26రోజుల పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించి ఏడాదిగా ఏం చేశారు.. ఏం ఇచ్చారు.. అని పదేపదే ప్రశ్నిస్తున్నవాళ్లకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దానిలో భాగంగానే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో మహత్తర కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి.. అందరి చూపు తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. ఏడాది కాలంలో ఎన్నో పథకాలు అమలు చేశామని చెప్తున్న సీఎం రేవంత్.. ప్రధానమైన రైతు రుణమాఫీ కూడా నెరవేర్చామంటున్నారు. దాదాపు 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు వెల్లడించారు. మరో 13 వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ చివరికి రైతుభరోసా కంప్లీట్ చేసేలా కసరత్తుక. ఇక ఇంత చేసిన రైతుల విషయంలో ఓ అపవాదు వెంటాడుతోంద..•









