వరి కోత మిషన్ ఢీకొని మహిళ మృతి

పాల్వంచ: వరి కోత మిషన్ ఢీకొని మహిళ మృతి. స్థానికుల వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని సోములగూడెం గ్రామంలో చెందిన పెద్ధినీటి అనసూర్య (55) అనే మహిళ తనకు గల అరఎకరం పొలమును ఆదివారం వరి కోత మిషన్తో కోయిస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ అనసూర్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram