అంబేద్కర్ విగ్రహానికి మెట్లు ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు

మణుగూరు పట్టణంలోని టీడీపీ సెంటర్లో నిర్మించిన డా.బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి  సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెట్లు ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు.

మండల దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు సింగరేణి మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్  స్పందించి బిఆర్అంబేద్కర్ విగ్రహానికి నిచ్చెన ఫ్లాట్ ఫామ్, మెట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి జిఎం ఆదేశాలతో గత రెండు రోజులుగా సింగరేణి ఏరియా వర్క్ షాప్ ఇంజనీరింగ్ సిబ్బంది  ఫ్లాట్ ఫామ్, ఐరన్ నిచ్చెన మెట్లు స్టాండ్ పనులను సోమవారం పూర్తి చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు గాని జయంతి, వర్ధంతి నిర్వహణ సమయంలో విగ్రహానికి పూలమాలలు వేయడం ఇబ్బందికరంగా ఉండేది. గత మూడేళ్ల నిరక్షణకు ఏరియా జిఎం దుర్గం రామచందర్ చొరవతో పూర్తి చేయడం పట్ల అంబేద్కర్ వాదులు, దళిత బహుజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేసి జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram