తెలంగాణ మళ్లీ ఆ బీర్లు వచ్చేస్తున్నాయి రాష్ట్రంలో బీర్ల సరఫరా పునరుద్దరణ చేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ నెల 8వ తేదీన నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటన చేసిన యుబీఎల్ ఇవాళ సరఫరా పునరుద్దరణ చేస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల చెల్లింపులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుబీఎల్ వివరించారు. ప్రభుత్వ హామీతో కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
Post Views: 38









