నిందితుడికి రెండు సంవత్సరాలు జైలు

నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ ఏ రాజేందర్ తెలిపారు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బందగిరి నగర్ పూణెం పాపారావు తన కుమారుడు అతని స్నేహితుడు అల్లుడికి బుచ్చి రాములు 2017 ఏప్రిల్ ఒకటవ తేదీన వెంకటాపురంలో పెళ్లి ఉన్నదని ఇద్దరు మోటార్ సైకిల్ పై వెళుతుండగా కరకగూడెం మండలం మద్దెలగూడెం రేగళ్ల  గ్రామాల మధ్యలో ద్విచక్ర వాహనం నుండి పడ్డారనుకొని తన కుమారుడు సురేష్ కు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడని బండి నడుపుతున్న లోగిడి బుచ్చిరాములకు  గాయాలు కాగా ట్రాక్టర్ పై వెళ్తున్న వారు108 వాహనం సమాచారమివ్వగా భద్రాచలం ఆసుపత్రికి, తరలించారు. తన కుమారుడు సురేష్ మృతి పై అనుమానం ఉన్నదని 2017 ఏప్రిల్ 2న కరకగూడెం పోలీస్ స్టేషన్ లో అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ. రాజ్ కుమార్ కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తులో భాగంగా అదే గ్రామం బందగిరి నగర్ కు చెందిన నూపురామ,నూప సతీష్ లు గాయపరిచగా పూనం సురేష్ చనిపోయాడని కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో 11 మంది సాక్షులను విచారించారు.

కేసు విచారణలో మొదటి నిందితుడు నూప రామ్ చనిపోయాడని అతనిపై కేసును కొట్టివేశారు. మృతుడి పీక పిసికి చనిపోయాడని పోస్టుమార్టం లో ఉన్నప్పటికిని ఈ నిందితునిపై హత్యా నేరం రుజువు కానందున, ఈ నిందితుడు గాయాలు కలుగజేసిన నేరము రుజువు అయినందున అతనికి ,రెండు సంవత్సరముల కారాగారా శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. వి. డి .లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించగా, జిల్లా కోర్టు నోడల్ అధికారి జి. ప్రవీణ్, లైజాన్ ఆఫీసర్ ఎన్.వీరబాబు, కోర్టు పిసి. ( కోర్టు డ్యూటీ ఆఫీసర్ ) మాలోత్ ఈశ్వర్ లు సహకరించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram