కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి పొడి చేసిన భర్త
హైదరాబాద్ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీర్పేట్ నివాసి కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను కుక్కర్లో వేసి ఉడికించి. వాటిని తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువలో పడేశాడు.
ఈనెల 13 నుంచి తమ కూతురు వెంకట మాధవి కనిపించటం లేదని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో గురుమూర్తి వారి వెంట ఉన్నాడు. భార్యపై అనుమానంతో గురుమూర్తే హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను చంపే ముందు నిందితుడు కుక్కను కూడా చంపేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. జిల్లెలగూడ చెరువు నుంచి ఆమె శరీర భాగాలను సేకరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి గతంలో భారత ఆర్మీలో పని చేశాడు. రిటైర్మెంట్ తర్వాత భారత ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్డీఓ లో ఔట్ సోర్సింగ్ విధానంలో సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతను కుటుంబంతో సహా.. హైదరాబాద్ లోని జిల్లెల్ల గూడలో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగ రీత్య హైదరాబాద్ లో ఉంటుండగా.. వీరికి ఇద్దరు పిల్లలు. బంధువులు, కుటుంబ సభ్యలుకు ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ కుటుంబంలో అనుమానాలు విష బీజాలు నాటుకున్నాయి. అవే క్రమంగా పెరిగి పెద్దవై. కుటుంబాన్ని తీరని విషాదం వైపు నడిపించాయి. అంతా బాగున్నారనుకుంటున్న తరుణంలో.
ఈనెల 9వ తేదీన గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని చంపి ఆనవాళ్లు లేకుండా చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. 9వ తేదీ రాత్రి నుంచి ఉదయం వరకు మాధవి మృతదేహాన్ని ముక్కలుగా కోసి శరీర భాగాలన్నింటినీ నాలుగైదు సార్లు కుక్కర్లో ఉడికించినట్లు వివరించాడు. అనంతరం వాటిని ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. నగర శివారులోని జిల్లా గూడ చెరువులో తన భార్య శరీరాన్ని కాల్చిన పొడిని చెరువులో కలిపినట్టు తెలిపాడు. శరీరం మొత్తాన్ని కాల్చి బూడిద చేయడం వల్ల ఆడవాళ్లు దొరకలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గురుమూర్తి తన భార్యను చంపడానికి ముందే రైలు కోసం ఒక కుక్కను చంపి ముక్కలుగా నరికి ఉడకబెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. పొడి చెరువు నీటిలో కలిసిపోవడంతో ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు కష్టతరంగా మారింది.









