బయటపడిన భారీ ఆయుధ డంప్..

భద్రాచలం: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో గురువారం 203 కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో  ఆపరేషన్ చేపట్టారు. ఇందులో మెటగూడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు 203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్కు చెందిన  కంపెనీలు కలిసి ఆపరేషన్ నిర్వహించాయి.

మెటగూడెం గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహను భద్రత అని పెట్టాయి. అందులో పరిశీలించగా 21 ఐఈడీలు, బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్ బాంబులు, ఒక జనరేటర్ సెట్, లాత్ మెషిన్ ఉపకరణాలు, భారీ పరిమాణంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామగ్రి ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram