తెలంగాణ కు అమెజాన్ భారీ పెట్టుబడులు

తెలంగాణలో భారీ పెట్టుబడులకు అంగీకరించిన అమెజాన్‌.

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం దూసుకుపోతోంది. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతూ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం.. తాజాగా మరో దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఒప్పందం చేసుకుంది.

దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. చర్చల అనంతరం రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్‌ అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకుంది. ఈ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది.

మరోవైపు ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ.750కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. ఈ పెట్టుబడితో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నాయి. ఇక విప్రో సంస్థ కూడా తన కంపెనీ విస్తరణకు ముందుకొచ్చింది. మొత్తానికి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో ప్రభుత్వం సఫలమైంది.

Facebook
WhatsApp
Twitter
Telegram