గోల్డెన్ న్యూస్/ కరకగూడెం: మండలంలోని బట్టుపల్లి గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభకు పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా,రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి లిస్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళారులను ఎవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదని పారదర్శకంగా ప్రతి ఒక్క దరఖాస్తుదారులకు నిరుపేదలకు తప్పకుండా లబ్ధి చేకూరేలా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తానన్నారు. గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేసింది లేదని పది సంవత్సరాలుగా నిరుపేదలు ఎంతమంది ఆకలితో ఆలమటించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు.
రైతుబంధు పేరుతో వేల ఎకరాలు ఉన్న భూస్వాములకు వేలకోట్ల రూపాయలు ధారాదత్తం చేసిన ఘనత గత ప్రభుత్వానిది అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అన్ని పథకాలు అందాలనే విధంగా అంకుఠిత దీక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగప్రసాద్, ఎంపీ ఓ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్, మండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచులు తోలెం నాగేశ్వరరావు, పోలే బోయిన శ్రీవాణి, పార్టీల నాయకులు ఎర్ర సురేష్, పోలే బోయిన తిరుపతయ్య , జలగం కృష్ణ , గొగ్గల రవి,స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ సెక్రటరి తదితరులు పాల్గొన్నారు.









