వేసవిలో విద్యుత్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడాలని కొత్త విద్యుత్‌ పాలసీ తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నట్టు పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. వేసవిలో విద్యుత్‌ ప్రణాళికపై ఎన్పీడీసీఎల్‌ సిబ్బందితో సమీక్ష నిర్వహించామని, పూర్తి సన్నద్ధతతో ఉన్నామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. రైతులు, పారిశ్రామిక వేత్తలు విద్యుత్‌ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాదాద్రిని గత ప్రభుత్వం వదిలేయడం వల్ల భారం పెరిగిపోయిందని, పర్యావరణ అనుమతులు వేగంగా తీసుకొచ్చి యాదాద్రి యూనిట్‌-2 ప్రారంభించుకున్నామన్నారు. వేసవిలో విద్యుత్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram