గోల్డెన్ న్యూస్ /ములుగు : మంగపేట మండలంలో గంజాయి పట్టివేత..గంజాయి తరలిస్తు తున్న ముగ్గురిని పట్టుకొని వారి నుంచి రూ. 63 వేల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏటూరునాగారం సీఐ. ఎ.శ్రీనివాస్, ఎస్ఐ టీవీఆర్.సూరి తెలిపారు. శుక్రవారం స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగపేట పోలీసులు గురువారం రాత్రి కమలాపూర్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని విచారించగా వారు మొరం కుమార్ తండ్రి మాసయ్య( 25) వాజేడు మండలం, వావిలాల సంతోష్, తండ్రి పోషాలు, వయసు (24) వెంకటాపురం నరం దాసరి ప్రవీణ్ కుమార్ తండ్రి బాలు, వయసు( 19) వెంకటాపురం అని తెలిపారు. వారి దగ్గర ఉన్న బ్యాగ్ పరిశీలించగా అందులో 2.5 కేజీ కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జ్యుడీషియల్ కస్టడీ కి తరలించిన పోలీసులు..









