మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం నీలాద్రి పేట గండి ఆదివాసి గ్రామానికి చెందిన కుంజ ఇరుమయ్య(48) అనే వ్యక్తి శుక్రవారం బర్లగూడెం గ్రామ శివారులోని చెరువు గట్టు పైన చెట్టుకి ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు.ఈ వ్యక్తి సుమారు రెండు సంవత్సరముల నుండి మతిస్థిమితం కోల్పోయి గతంలో రెండు సార్లు ఇంటి నుండి వెళ్లిపోగా తన కుటుంబ సభ్యులు అతని వెతికి పట్టుకున్నారు. శుక్రవారం ఉదయాన్నే కుంజ ఇడుమయ్య తన ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి బర్లగూడం ఊరి చివరన చెట్టుకి ఉరేసుకొని చనిపోయినాడు. ఈ విషయంపై మృతుడి భార్య కుంజా పొజ్జమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి కొడుకు ఒక కూతురు ఉన్నారు.









