గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండల లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ను మంగళవారం భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయుల విద్యార్థులకు సక్రమంగా బోధించాలని ఆదేశించారు. హాస్టల్ కి ఫ్యాబ్రికేషన్ డైనింగ్ హాల్ నిర్మాణం కోసం 20 లక్షల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం ఆరెం వారి గుంపులో ఉన్న ఎంపీపిఎస్ పాఠశాలను సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ కుమార్, ఏం ఈ ఓ మంజుల, ఆర్ ఐ పోలేబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 65









