జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ అయిన హేమచంద్రపురం నందు గల పెరేడ్ మైదానం మరియు క్రీడా మైదానం నందు ఈ రోజు జిల్లా పోలీసుల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా పోలీస్ శాఖలోని విభాగాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు.అనంతరం యానిమల్ స్పోర్ట్స్ మీట్ ఫ్లాగ్ ను ఎస్పీ ఆవిష్కరించారు.భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ ముఖ్య అతిథి అయిన ఎస్పీ గారిని స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేసిన తర్వాత ఎస్పీ గారు జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించడం జరిగింది.అనంతరం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిత్యం తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు.విధుల నిర్వహణలో భాగంగా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసు అధికారులు,సిబ్బందికి ఆటవిడుపు, మానసికొల్లాసం కొరకు ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడలలో ఆసక్తిగల పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారని తెలిపారు.క్రికెట్,వాలీబాల్,చెస్,క్యారమ్స్,టగ్ ఆఫ్ వార్,కబడ్డీ,షటిల్ బాడ్మింటన్,అథ్లెటిక్స్,5 కిలోమీటర్ల పరుగు పందెం వంటి క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.గెలుపోటములు సహజమని క్రీడాకారులందరూ స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆడాలని అన్నారు.పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ తమ శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరియు మానసికోల్లాసానికి ఏర్పాటుచేసిన ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ స్పోర్ట్స్ మీట్ పేరెడ్ ఏర్పాట్లను అద్భుతంగా తయారుచేసిన అధికారులను అభినందించారు. అనంతరం ముందుగా హోంగార్డ్స్ టీమ్ మరియు పాల్వంచ సబ్ డివిజన్ మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ ను టాస్ వేసి ఎస్పీ ప్రారంభించారు.అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ టీం మరియు ఇల్లందు సబ్ డివిజన్ టీమ్ ల మధ్య ఉత్కంటభరీతంగా జరిగిన క్రికెట్ మ్యాచ్ ను తిలకించారు.
Post Views: 44









