బస్ షెల్టర్ ను వినియోగంలోకి తెస్తాము. ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : మండల పరిధిలోని  వీరాపురం క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న బస్సు షెల్టర్‌ను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న బస్ షెల్టర్ వినియోగంలో లేకపోవడంతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను  అడిగి తెలుసుకున్నారు, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే బస్సు షెల్టర్ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలో తీసుకొస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram