గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్రంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై విశ్వాసంతో అధికారం అప్పగించారని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. చంద్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో భారాస ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో మహిళాశక్తి పథకం ద్వారా రూ. వందకోట్లు మంజూరీ చేయించానన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మరో 61 ఇళ్లకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని 26 మందికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే జారే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీ ప్రసన్న, గృహనిర్మాణశాఖ ఏఈ రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు భోజ్యానాయక్ సారేపల్లి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.









