అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీతో బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే
గోల్డెన్ న్యూస్/ మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదం ప్రతి ఇంటికి చేరే విధంగా రూపొందించిన కార్యక్రమాన్ని బుధవారం మండల ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కోఆర్డినేటర్ ఏలూరు కోటేశ్వరరావు,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పిరీనాకి నవీన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మణుగూరు టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య గారు, కూచిపూడి బాబు గారు, సామ శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, అబ్దులా,కుర్రం రవి ,గాండ్ల సురేష్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









