ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపిన 45 ఏండ్ల తల్లి
గోల్డెన్ న్యూస్ /సంగారెడ్డి : అమీన్ పూర్‌లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటనలో సంచలన విషయాలు
వివాహేతర సంబంధం కారణంగా పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత(45)
ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి ఏర్పడ్డ పరిచయం
పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఘాతుకానికి పాల్పడ్డ రజిత
గత నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపిన తల్లి
అయితే పెరుగు తినకుండా.. వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయిన భర్త చెన్నయ్య.. తర్వాత పిల్లలకు పెరుగన్నం పెట్టిన నిందితురాలు
అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08)
కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య.
విచారణలో బయటపడ్డ రజిత బాగోతం. రజిత ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు









