భద్రాచలం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ .

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించే పట్టాభిషేకం వేడుకకు హాజరయ్యేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హెలికాప్టర్లో సారపాక చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గంలో ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గంలో భద్రాచలం బయల్దేరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram