గోల్డెన్ న్యూస్/ కొత్తగూడెం : చపాతీలు చేయలేదని విద్యార్థినులను చితకబాదిన ఘటన రామవరం గిరిజన బాలికల గురుకులం చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాలను ప్రకారం. రామవరం లోని బాలికల గురుకులంలో 600 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. 8 వ తరగతి విద్యార్థినులను అల్పాహారం కోసం ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు చపాతీలు చేసేందుకు గురుకులంలోని ఓ ఉపాధ్యాయురాలు నిద్ర లేపగా. కొందరు విద్యార్థినులు లేచి చపాతీలు మొదలుపెట్టారు, 21 మంది విద్యార్థినులు నీరసంగా ఉందని చెప్పి పడుకున్నారు. దీన్ని మనసులో పెట్టుకొని ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ 21 మంది విద్యార్థులను ఉపాధ్యాయురాలు గదిలోకి పిలిచి బూతులు తిడుతూ, చేతులు తిప్పి కీళ్ల పై, మోచేతుల పై విచక్షణారహితంగా కమిలిపోయేలా కొట్టినట్లు తెలిపారు. సుమారు గురుకుల పాటు పాఠశాల వద్ద వద్ద ఆందోళన చేపట్టారు. అక్కడున్న ప్రిన్సిపాల్, సిబ్బంది ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని తల్లిదండ్రులకు సర్ది చెప్పడంతో వారు వెళ్ళిపోయారు. .
ఈ అంశం పై గురుకులం ఉపాధ్యాయురాలికి మెమో జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.









