గోల్డెన్ న్యూస్./ టేకులపల్లి : చేత బడి చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలు ఆరుగురు నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. చేసుకుంది. సీఐ సత్యనారాయణ, ఎస్సై సోమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం పంచాయతీ బూసురయి గ్రామానికి చెందిన, మడకం బీడ రాజు ను (35) ఆరుగురు వ్యక్తులు మడవి రాజు,మొక్కటి చిన్న సోమయ్య, మొక్కటీ భీమయ్య, వజ్జం గంగ, వేకో జోగా, మొక్కటి వెంకటేశ్వర్లు తీవ్రంగా కొట్టి హత్య చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ గ్రామంలో పోడియం నందు కుదురు, గంగి (3) గత కొంతకాలంగా ఆనారోగ్యం పాలై మృతి చెందింది. బీడరాజు చేతబడి చేయడంతోనే తమ కూతురు మృతి చెందిందని అనుమానంతో కొందరు గుత్తికోయ గ్రామస్తులు కోపంతో రాజును బాలిక శవం వద్దకు తీసుకవచ్చి తాళ్లలో కట్టేసి కర్రలతో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహన్ని రాజు ఇంటిముందు పడేశారు. గురువారం సమాచారం తెలుసుకున్న కున్న పోలీసులు బుసురాయికి గ్రామానికి చేరుకుని హత్యకు గల కారణాలు పరిశీలించారు. మృతుడు కుటుంబ సభ్యులు ఎట్టి నందిని ఫిర్యాదు మేరకు మడవిరాజు, మొక్కటి చిన్నసోమయ్య, మొక్కటి భీమయ్య, వజ్ఞ గంగ, వేకో జోగా, మొక్కటి వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన ఆరుగురు వ్యక్తిలు పరారీలో ఉన్నట్టు తెలిపారు. మృతుడి రాజుకు లక్ష్మి, పొజ్జి, సన్ని ముగ్గురు భార్యలు ఉన్నారు.